హరికృష్ణ భౌతికకాయాన్ని ఎన్టీఆర్ భవన్ లో అందుకే పెట్టలేదా?

Monday, 3 September 2018పార్టీకి సంబంధించిన ముఖ్యనేత చనిపోతే ఆయన పార్థివదేహాన్ని పార్టీ ఆఫీసు తీసుకెళ్లడం మనం చూస్తూనే వుంటాం. కానీ, టీడీపీ సీనియర్ నందమూరి హరికృష్ణ మృతదేహాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌కు తరలించలేదు. తొలుత ఆయన పార్థివదేహాన్నితరలించాలని భావించారు నేతలు. కానీ శ్మశాన వాటికకు వెళ్లేముందు భౌతిక కాయానికి స్నానం చేయించాల్సివుంది.ఇదంతా చేసి టీడీపీ ఆఫీసుకి తీసుకెళ్తే.. మళ్లీ స్నానం కోసం ఇంటికి తీసుకురావాల్సి వుంటుందని, ఇదంతా ఇబ్బందితో కూడిన వ్యవహారమని భావించి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తీసుకెళ్లలేదని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. దీంతో ప్రజల సందర్శనార్థం హరికృష్ణ ఇంటివద్దనే వుంచారు. ఇందులోభాగంగానే హరికృష్ణ పార్థివదేహంపై టీడీపీ జెండాను వుంచారు అధినేత చంద్రబాబు.