చంద్రబాబుని టార్గెట్ చేసిన కెసిఆర్ మరియు బీజేపీ

Friday, 7 September 2018


తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోవడానికి ప్రధానకారణం కెసిఆర్ అని అందరు అనుకుంటున్నారు కానీ అసలు సూత్రదారి మాత్రం వేరే వారున్నారు అంతేకాదు ఇంకోకారణం కూడా ఉంది.
ప్రస్తుత పరిస్థితుల్లో  మోడీని ధీటుగా ఎదుర్కోగల నాయకుడు ఉన్నదంటే అది ఒక్క చంద్రబాబు మాత్రమే! చంద్రబాబు ఇప్పటికే మోడీ మీద తిరుగుబావుటా వేసాడు, బాబు గారు తనకున్న పాపులార్టీ మరియు పలుకుబడి తో 2019 లో  కేంద్రంలో చక్రం తిప్పడం ఖాయం అని బీజేపీ ద్వయం పసిగట్టిసింది. బాబుని దెబ్బకొట్టాలంటే ముందు బాబుని బలహీనపరచాలి.దానికి మొదటి అడుగే ఈ తెలంగాణ ముందస్తు ఎన్నికలు. టీడీపీ అధినేత బాబుని దెబ్బకొట్టడానికి తెరాస ప్రభుత్వం అవసరం, బాబు గారు దేనికి కూడా కంగారు పదారు ఒక్క నోటు కి ఓటు కేసు తప్ప అని అందరికి విదితమే.కేసు కోర్టులో నిలబడకపోయిన కూడా బాబుని చిరాకు పెట్టాలంటే బీజేపీకి దొరికిన ఒకే ఒక్క అస్త్రం నోటు కి ఓటు. తెరాస  ప్రభుత్వం మళ్ళి తెలంగాలో తీసుకొని వస్తే, నోటు కి ఓటు కేసు తిరగతోడి బాబుని ఎన్నికల నాటికి కోర్టుల చుట్టూ తిప్పించి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ మరియు జనసేన లతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనీ ఆశపడుతోంది.తెలంగాణ ఎన్నికలో తెరాస కి బీజేపీ స్నేహపూర్వక పోరుకి సిద్దపడింది.కిషన్ రెడ్డి లాంటివాళ్లు ఎంపీ గ నిల్చుంటున్నారు అంటే అర్థంచేసుకోవచ్చు తెరాస మరియు బీజేపీ మైత్రి. తెలంగాణాలో రెడ్ల ఓట్లు చాలా ముఖ్యం, కెసిఆర్ మీద ఇప్పటికే రెడ్లు పీకలదాకా కోపంగా ఉన్నారు. వాళ్ళని మచ్చిక చేసుకోవడానికి జగన్ & కో సిద్ధమైంది. దానికి సాక్షమే చివిరెడ్డి మొన్న తెలంగాణాలో చేసిన హడావిడి.కొత్తగా విజయసాయి రెడ్డి గారు కూడా నల్గొండ మరియు ఖమ్మం జిల్లాలో పర్యటనలు ఇందులోని భాగమే!

తొందరలోనే జనసేన కూడా వీళ్ళతో కలసిన అర్చర్యం లేదు.మొత్తానికి చంద్రబాబుని బీజేపీ & కో టార్గెట్ చేసింది అనేది ప్రస్ఫుటంగా కనపడుతోంది. చూడాలి బాబు గారు ఎలాంటి ఎత్తు వేస్తారో!