అరవింద సామెత ఆడియో వేడుకలో బాలయ్య! నందమూరి అభిమానులకి మాత్రం శుభవార్తే !

Saturday, 8 September 2018త్రివిక్రమ్- తారక్ కాంబినేషన్లో వస్తున్న టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై భారీ స్థాయిలో నిర్మితమవుతున్న ఈ మూవీ కోసం ఎన్టీయార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే.. టీజర్ విడుదలై సంచలనం సృష్టిస్తోంది. తారక్ డైనమిజంకి త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ తోడై.. సినిమా అంచనాల్ని అమాంతం పెంచేసింది ఈ టీజర్. ఇక మిగిలింది.. ఆడియో వేడుక. దీనికి సంబంధించిన స్పష్టత కూడా వచ్చేసింది. హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో ఈనెల 20న ఆడియో ఫంక్షన్ నిర్వహించనున్నట్లు నిర్మాతలు చెప్పారు. అయితే.. ఆడియో వేడుకను భారీ స్థాయిలో కాకుండా.. ఆడంబరం తగ్గించి నిర్వహించాల్సిందిగా నిర్వాహకులకు, నిర్మాతలకు తారక్ సూచనలిచ్చారు హీరో తారక్.

ఇటీవలే తండ్రిని కోల్పోయిన తారక్.. ఆ వేదనను దిగమింగుకుని రామోజీ ఫిలిం సిటీలో షూట్‌కి హాజరవుతున్నాడు. ఈ క్రమంలో ఆడియో వేడుకలో కూడా అట్టహాసం ఉండకూడదని తారక్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆడియో విడుదల వేదిక మీద చీఫ్‌గెస్ట్‌గా హీరో బాలకృష్ణని ‘ప్లాన్’ చేసినట్లు సమాచారం. ఈ మేరకు అబ్బాయ్‌కి బాబాయ్ నుంచి ‘ఓకె’ వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవైపు ‘ఎన్టీయార్’ బయోపిక్ షూట్ జరుగుతుండగానే.. సోదరుడు హరికృష్ణ మృతి చెందడం.. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు జరగడం.. ఇలా వరుస పరిణామాలతో బాలయ్య షెడ్యూల్‌లో కొంచెం గజిబిజి నెలకొంది. ఈ క్రమంలోనే.. తారక్ మూవీ ‘అరవింద సమేత వీరరాఘవ’ ఆడియో వేడుకకు రావాలని తారక్ బాబాయ్  బాలకృష్ణ ని కోరగా వెంటనే తప్పక వస్తాను అని చెప్పాడు.

నందమూరి అభిమానులకి మాత్రం శుభవార్తే !