టీడీపీకి భారీ దెబ్బ * పార్టీలో ఆందోళన!

Tuesday, 7 August 2018కృష్ణాజిల్లా అవ‌నిగ‌డ్డ నియ‌జ‌క‌వ ర్గానికి సంబంధించి అత్యంత కీల‌క‌నాయ‌కుడు, 
పార్టీని  స్థాపించిన స‌మ‌యం నుంచి కూడా పార్టీకి అన్ని విధా లా అండ‌గా ఉన్న నేత .. బూర‌గ‌డ్డ ర‌మేష్ నాయుడు పార్టీకి రాజీనామా చేశారు. జిల్లాలో ఈ వార్త సంచ‌ల‌నం సృష్టించింది. పార్టీ ప్రతినిధిగా, ప్రజాప్రతినిధిగా 35ఏళ్ల నుంచి వివిధ స్థాయిల్లో అంకిత భావంతో ప‌నిచేస్తున్నారు బూర‌గ‌డ్డ‌. 
గ‌తంలో రెండుసార్లు అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్ మీద ఓడిపోయారు. 1999లో స్వ‌ల్ప తేడాతోను, 2004లో మ‌ళ్లీ ఓడిపోయారు. ఇక‌, 2009 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి అంబ‌టి బ్రాహ్మ‌ణ య్య కోసం టికెట్‌ను త్యాగం చేయాల్సి వ‌చ్చింది. పోనీ.. 2014లో అయినా ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని భావిస్తే.. అప్ప‌టికి.. మారిన రాష్ట్ర రాజ‌కీయాల నేప‌థ్యంలో ఏకంగా మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆయ‌న‌కు టికెట్ కేటాయించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ ప‌రిణామాల‌తో వ‌రుస‌గా బూర‌గ‌డ్డ నిరాశ‌లో కూరుకుపోయారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ‌కు చైర్మ‌న్‌గా నియ‌మించారు. దీని ప‌ద‌వీ కాలం రెండేళ్లే కావ‌డం తో ఆయ‌న ప‌ద‌వి నుంచి వైదొలిగి ప్ర‌స్తుతం మాజీగా ఉన్నారు. అయితే, తాజాగా జ‌రిగిన నామినేటెడ్ ప‌ద‌వుల పంప‌కంలో ఆయ‌న‌కు స్థానం ద‌క్కుతుంద‌ని ఎంతో ఆశ‌పెట్టుకున్నారు. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. పైగా.. ఇదే జిల్లాలో వైసీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన బూర‌గ‌డ్డ వేద‌వ్యాస్‌ను చంద్ర‌బాబు పార్టీలోకి ఆహ్వానించి.. ఆయ‌న‌కు నామినేటెడ్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. ఈ వ‌రుస ప‌రిణామాల‌తో ర‌మేష్ తీవ్ర మ‌న‌స్థాపానికి గుర‌య్యారు. పార్టీలో ద‌శాబ్దాల త‌ర‌బ‌డి సేవ‌లు చేస్తూ.. విప‌క్షంలో ఉండ‌గా.. వివిధ ఆందోళ‌న‌ల్లో తాము  పోలీసుల లాఠీ దెబ్బ‌లు తిన్నామ‌ని, అధికారంలోకి వ‌చ్చాక అయినా త‌మ‌కు గుర్తింపు ల‌భిస్తుంద‌ని భావించామ‌ని, కానీ, కొత్త‌గా వ‌చ్చిన కొమ్ముల‌నే చంద్ర‌బాబు అలంక‌రిస్తున్నార‌ని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ.. పార్టీకి రాజీనామా స‌మ‌ర్పించారు. 

YSRCP Party Worrying....