శ్రీనివాస కళ్యాణం మూవీ రివ్యూ

Thursday, 9 August 2018


విడుదల తేదీ : 08.08.2018
మ్యూజిక్  మిక్కీ  జె  మేయర్    
నిర్మాత దిల్ రాజు    
కథ & దర్శకత్వం : సతీష్ వేగేశ్న 
సినిమాటోగ్రఫీసమీర్ రెడ్డి
నిర్మాణ సంస్థ: శ్రీ  వెంకటేశ్వర  క్రియేషన్స్
తారాగణం :  నితిన్,రాసి ఖన్నా, ప్రకాష్ రాజ్,జయసుధ ,అజయ్, అన్నపూర్ణ,రాజేంద్రప్రసాద్,సితార   తదితరులు. 

శ్రీనివాస కళ్యాణం మూవీ రివ్యూ 

అ..ఆ తర్వాత నితిన్ కి చెప్పుకోదగ్గ విజయం దక్కలేదు. రాసి ఖన్నా తో మొదటిసారి జత కట్టి ఫ్యామిలీ డ్రామాతో వస్తున్నా చిత్రం శ్రీనివాస కళ్యాణం. శతమానంభవతే తర్వాత సతీష్ వేగేశ్న మరో సరి కుటుంబకథా చిత్రం తో వస్తున్నా చిత్రం, అందునా దిల్ రాజు బ్యానర్ నుండి వస్తోంది అంటే నిర్మాణ విలువలు మరియు కథ అంతా పకడ్బందీగా ఉంటాయి అని పరిశ్రమలోని మాట.

బలాబలాలు 

బలం:
ఫీల్ గుడ్ మూవీ,
కథనం
మంచి సందేశం
పాటల చిత్రీకరణ 
నటీనటులు 
నిర్మాణ విలువలు
మాటలు 

బలహీనత:
పాత కథ

విశ్లేషణ:  పెళ్లి అనే అంశంతో కథ కథనం తో వచ్చిన శ్రీనివాస కళ్యాణం చిత్రం మొదటి సన్నివేశం నుండి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. నితిన్ మరియు రాశి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. దర్శకుడు చెప్పాలనుకున్నది చాల చక్కగా తెరమీద చూపియించాడు. కథ పాతది అయ్యినకూడా కథనంతో కొత్తదనం తీసుకొచ్చాడు. ప్రకాష్ రాజ్ జయసుధ మరియు రాజేంద్రప్రసాద్ వారి వారి పాత్రలకు న్యాయం చేసారు. ప్రేక్షకుడు చిత్రం చూసి బైటికివచేటప్పుడు ఒక మంచి చిత్రం చూసాను అన్న ఫీలింగ్ తో ఉంటాడు. 

రేటింగ్:  3.25/ 5 

చివరి మాట:   మంచి అనుభూతితో బైటికి వస్తారు! చూసిరండి ....

(బంధుమిత్రులకు షేర్ చేయండి)


గమనిక: ఈ రివ్యూ వ్యక్తిగతం గ భావించవలసిందిగా కోరుతున్నాం.