మోడీ మీద అగ్గిమీద గుగ్గిలం అవుతున్న కేరళ ప్రజలు!

Saturday, 18 August 2018కేరళ వరద ప్రభావిత ప్రాంతంలో ప్రధానమంత్రి మోదీ ఏరియల్ సర్వే చేపట్టారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్, కేంద్రమంత్రితో కలిసి ఏరియల్ సర్వే చేశారు. మొత్తం 14 జిల్లాలకు గాను 13 జిల్లాల్లో వరద భీభత్సం సృష్టించింది.

అనంతరం ప్రభుత్వ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష జరిపిన పీఎం మోదీ, తక్షణసాయం కింద 500 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వరదలు మొదలైన మొదట్లో హోంమంత్రి రాజ్‌నాథ్ ప్రకటించిన వందకోట్లు దీనికి అదనం. కానీ, కేరళ ప్రభుత్వం మాత్రం కేంద్ర సాయంపై పెదవి విరుస్తోంది.

వరదలతో రాష్ర్టానికి 25 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని, అత్యవసర సహాయ చర్యల కోసం కనీసం 2,500 కోట్లు కేటాయించాలని సీఎం విజయన్.. మోదీని రిక్వెస్ట్ చేశారు. రివ్యూ మీటింగ్‌లో అధికారుల సమక్షంలోనే కేరళ సీఎం.. మోదీని నిలదీసినట్టు సమాచారం.

ఇదిలావుంటే మోదీ సర్కార్ కేరళ పట్ల వివక్ష చూపుతోందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రచార ఆర్భాటాల కోసం వేల కోట్లు తగలేసే కేంద్రం, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మాత్రం ఉత్తుత్తి సాయం చేయడం, చేతులు విదిల్చి వెళ్లిపోవడం హేయమని కేరళైట్స్ ఆగ్రహిస్తున్నారు.మోడీ మరో సరి దక్షిణాది మీద వివక్ష బహిర్గతం అయ్యింది అని సోషల్ మీడియా లో బాగా ప్రచారం అవుతోంది. మరి బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి!