వైవీ సుబ్బా రెడ్డి మీద జగన్ కస్సు బస్సులు * నోచుకున్న సుబ్బా రెడ్డి

Tuesday, 3 July 2018జగన్ తన పాదయాత్రలో ప్రజలకు భరోసా ఇస్తూ ప్రస్తుతం వారు పడుతున్న కష్టాలు భవిష్యత్తులో ఉండవంటూ కొద్ది నెలలు ఓపిక పట్టండి అంటూ మంచి రోజులు వస్తాయి అని ప్రజలలో ధైర్యం నింపుతున్నారు. అయితే వైసీపీ పార్టీ అధినాయకుడు జగన్ ఎలా వ్యవహరిస్తుంటే వైసీపీ పార్టీ నాయకులు మాత్రం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ప్రకాశం జిల్లా జగన్ కు బాబాయ్ వరస అయ్యే వైవీ సుబ్బారెడ్డి  పార్టీ వ్యవహారాల్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని జగన్ కి తెలిసింది.

ఈ విషయంలో జగన్ కూడా సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఇటీవల వైవీ సుబ్బారెడ్డికి జగన్ క్లాస్ పీకడం కూడా జరిగిందని సమాచారం. పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో వైవీ సుబ్బారెడ్డి తనకు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న విషయం ప్రస్తుతం పార్టీలో అనేక మంటలు రగిలిస్తూ నేపద్యంలో జగన్ వెంటనే వైవీ సుబ్బారెడ్డి సమావేశం అయినట్టుగా తెలుస్తోంది. 

తనకు నచ్చిన వారికి అనుకూలంగా రిపోర్టులు ఇస్తూ, తనకు నచ్చని వారికి నెగిటివ్ రిపోర్టులు ఇస్తున్నారట వైవీ. ఈ వ్యవహారంపై జగన్ కు కూడా ఆగ్రహం వచ్చిందని వైసీపీలో ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లా ఏ కాకుండా పశ్చిమగోదావరి తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థుల ఎంపిక వ్యవహారాల్లో కూడా వైవీ సుబ్బారెడ్డి తమ ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లు తేలడంతో జగన్ ఈసారి గట్టిగానే క్లాస్ తీసుకున్నారట.

చూడాలి జగన్ క్లాస్ కంటితుడుపు చర్యనా కదా అన్నది భవిష్యతులో తెలన్నది!