రాష్ట్రంలో దూసుక పోతున్న టీడీపీ ... నిచ్చేష్టులైన వైసీపీ

Tuesday, 17 July 2018అమరావతి: చంద్రబాబు తన అనుబవంతా రంగరించి ఎన్నికలు మరో ఏడాదిలో ఉన్నాయి అనగా ప్రభుత్వం ప్రెవేశపెడుతున్న కొత్త కొత్త పథకాలు వాటిని అమలు చేసే విధానం ....ప్రజల్లో ఎలా తీసుకొని పొతే మంచి స్పందన వస్తుందో ఆలా విధివిధానాలు తయారు చేసుకొని రాష్ట్రంలో దూసుకొని పోతోంది టీడీపీ. ఉదాహరణకు అన్న కాంటీన్ .... బీదవారి దెగ్గర నుండి ధనికుల వరకు అందరు ఆదరిస్తున్న పతాకం అని చెప్పవచ్చు.ఐదు రూపాయలకు తేనీరు కూడా రాని ఈరోజుల్లో ఉదయం ఫలహారం , మధ్యాహ్నం భోజనం రాత్రికి మళ్ళి భోజనం ... అంటే 15 రూపాయలతో ఒక రోజు గడపచ్చు. ప్రస్తుతానికి ఐతే ఈ పథకం సూపర్ హిట్ అనే చెప్పాలి.మొదట అన్న కాంటీన్ మీద అధికార పార్టీ మరియు ప్రతిపక్షం  ఎవరు పెద్దగా ద్రుష్టి పెట్టలేదు....కారణం ఈ పథకం ప్లాప్ అవుతుంది అని అనుకున్నారు.కానీ బాబు దేన్నీ అనూహ్యాంగా ప్రజల్లోకి తీసుకొని పోయి మంచి మార్కులు కొట్టేసారు. మరో పక్క చంద్రన్న గృహాలు .... ప్రతి నియోజకవర్గంలో  చంద్రన్న గృహాలు కట్టిస్తున్న తీరు ఆ ఇళ్ల మన్నిక చూసి అధికార పార్టీ వల్లే నోరెళ్లపెడుతున్నారు. అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి అంతటి వారే ఈ ఇంటికి ఇందిరమ్మ ఇంటికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది అని అన్నారంటే ... చంద్రన్న గృహాలు ఈ రేంజ్ లో ఉన్నాయో! స్వయానా వైసీపీ నేతలే మళ్ళి మీ బాబు మాకు దెబ్బేస్తున్నదే అని టీడీపీ నేతలతో అంటున్నారు.ఏపీ మొత్తానికి నీరు ఇస్తా అని చెప్పి మరీ దశలవారీగా దాదాపుగా అన్ని జిల్లాలకు నీరుని తీసుకొస్తున్నారు. నిన్నటికి నిన్న హిందూపూర్ లో నీరు వచ్చి దాదాపుగా రెండు దశాబ్దాలు అయ్యింది. అలాగే అనంతపురంలో చాలా ప్రాంతాలకు నీటిని తెప్పిస్తున్నారు ..... గుంటూరు కృష్ణ , తూగో , పా గో , చిత్తూర్ , కడప కి ఇప్పటికే నీరు తెప్పించారు. పోలవరం అయిపోగానే రాష్ట్రం మొత్తం నీటిని అందిస్తా అని డంకాభజాయించి చెపుతున్నారు బాబు. ఇక పరిశ్రమల గురించి సరేసరి!వచ్చేనెల నుండి నిరుద్యోగ భృతి పతాకం ప్రెవేశపెట్టనున్నారు ...అదికూడా హిట్ ఐతే ఇంక బాబుకి 2019  లో  ఎదురులేదని చెప్పాలి. విచిత్రం ఏంటంటే ఇన్ని మంచి మంచి పతకాలు సూపర్ హిట్ అవుతుంటే ప్రతిపక్షం నేతలు చూస్తూ ఉండిపోతున్నారు. పతకాలలోని చిన్న చిన్న లోపాలను/పొరపాటులను  వెతుకుతున్నారే గాని వాటివల్ల టీడీపీ గ్రాఫ్ పెరిగిపోతోంది ఎలా నిలువరించాలో తెలియడం లేదు.

జగన్ తన ఊహల్లో తనూఉన్నాడు , పాదయాత్ర చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నాడు. వైసీపీ నేతలే యింకా పాదయాత్ర చేసుకుంటూ పొతే ఎప్పుడు పార్టీ మీద ద్రుష్టి పెట్టేది అని వెనకాల అనుకుంటున్నారు. రాయలసీమ నేతలకి పాదయాత్ర బోర్ కొట్టిస్తోంది. తొందరగా అయిపోతే బాగుండు అని కోరుకుంటున్నారు.

మొత్తానికి బాబు పతకాలతో దూసుకొని పోతుంటే వైసీపీ మాత్రం పాదయాత్ర చేసూ కాలంవెళ్లబుచ్చుతోంది.