పిల్లి టీడీపీ గోడవైపు దూకడానికి రెడీ!

Thursday, 5 July 2018వైఎస్ మరణానంతరం జగన్ కు అండగా ఉన్న అతి కొద్ది మందిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒకరు. ఇండిపెండెంట్ గా గెలిచన ఘనత కూడా ఈయనకు ఉంది.కానీ, గత ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే, వైసీపీ కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబాబు సేవలకు గాను ఆయనకు ఎమ్మెల్సీ పదవిచ్చారు వైఎస్ జగన్.ఇంతవరకు బాగానే ఉంది కానీ, వచ్చే ఎన్నికల్లో పిల్లి తన తనయుడుని రామచంద్రాపురం అసెంబ్లీ బరిలో దింపి, తాను రాజమండ్రి ఎంపీగా  పోటీ చేయాలనీ పిల్లి భావిస్తున్నాడు.

పిల్లికి తెలియకుండా రామచంద్రాపురం నియోజకవర్గానికి మాజీ జడ్పీ చైర్మన్ వేణుగోపాలకృష్ణ అభ్యర్థిత్వాన్ని జగన్ ఖరారు చేసినట్లు వార్తలు రావడంతో పిల్లి అసంతృప్తికి లోనయ్యారట.తనకు తెలియకుండా ఏ విధంగా టికెట్ ఖరారు చేస్తారన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అదీ కాకుండా రాజమండ్రి ఎంపీ టికెట్ తనదే అని భావిస్తున్న తరుణంలో ఆ టికెట్ ను  ఓ బడా పారిశ్రామికవేత్తకు ఇచ్చేందుకు జగన్ చూస్తున్నాడని వార్తలు రావడంతో పిల్లి సుభాష్ చంద్ర బోస్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.

వచ్చే ఎన్నికల్లో పిల్లి కుటుంబానికి టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని ప్రశాంత్ కిశోర్ రిపోర్టులో ఉన్నట్లు సమాచారం, ఎలాగు పిల్లి ఎమ్మెల్సీగా ఉన్నందున ఆయన పదవి 2021 వరకు ఉంది కాబట్టి, ఆయన్ను ఎన్నికల బరి నుంచి తప్పించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారట. జగన్ కోసం మొదటి నుంచి తాను ఎంతో కష్టపడ్డానని తీరా ఎన్నికల సమయానికి ఇంత దెబ్బేస్తారని అనుకోలేదని .. ఇక వైసీపీలో ఉంది ప్రయోజనం లేదని పిల్లి తన సన్నిహితుల దగ్గర వాపోయాడట. ఈ దశలోనే ఆయన టీడీపీలోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నాడని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఢిల్లీ నుండి కాంగ్రెస్ కూడా పిల్లితో మాట్లాడింది, కానీ టీడీపీ వైపే మొగ్గు చూపిస్తున్నారని టాక్!