బాలయ్యను టార్గెట్ చేసిన పవన్ * బాలకృష్ణ మీద సంచలన వ్యాఖ్యలు

Wednesday, 25 July 2018 ప్ర‌జాపోరాట యాత్ర‌లో భాగంగా భీమ‌వ‌రంలో  విశ్రాంతి తీసుకుంటున్న  ప‌వన్ ను అభిమానులు క‌లిశారు.  ఆ    
సంద‌ర్భంగా అభిమానులు పోలీసుల‌పై ఫిర్యాదులు చేశారు. త‌మ మోటారు బైకుల‌కు సైలెన్స‌ర్లు తీసేయ‌టాన్ని  పోలీసులు త‌ప్పు ప‌డుతున్న‌ట్లు అభిమానులు చెప్పారు. నిజానికి సైలెన్స‌ర్ లేకుండా తిర‌గ‌టం మోటారు వాహ‌నాల యాక్ట్ ప్ర‌కారం త‌ప్పు. ఎందుకంటే, సైలెన్స‌ర్ లేకుండా 
న‌డిచే వాహ‌నం నుండి విప‌రీత‌మైన శ‌బ్దం బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఆ శ‌బ్దం ఇతరుల‌కు న్యూసెన్స్ గా ఉంటుంది.  కాబ‌ట్టి ఏ వాహ‌నం కూడా  సెలెన్స‌ర్ లేకుండా తిర‌గ‌కూడ‌దు. అదే విష‌యాన్ని అభిమానుల‌కు ప‌వ‌న్ చెప్పి ఉండాల్సింది. కానీ  అభిమానులు ఫిర్యాదు చేయ‌గానే రెచ్చిపోయారు. పోనీ పోలీసులను త‌ప్పుప‌ట్టారా అంటే అదీ లేదు.  అభిమానుల ఫిర్యాదుకు ఏమాత్రం  సంబంధం లేని నంద‌మూరి బాల‌కృష్ణ ఇంట్లో కాల్పుల గురించి ప్ర‌స్తావించారు.

త‌న అభిమానులు మోటారు బైకుల‌క  సైలెన్స‌ర్లు లేకుండా తిరుగుతుంటే తప్పంటున్న పోలీసులు,  ఇంట్లో 
తుపాకితో కాల్చిన వారిని మాత్రం ప‌ట్టించుకోవ‌టం లేదంటూ పరోక్షంగా బాల‌కృష్ణ‌ను సీన్ లోకి తీసుకొచ్చారు.   బాల‌కృష్ణ‌ను ఉద్దేశించి ప‌వ‌న్ చేసిన తాజా వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.