లోకేష్ కి సవాల్ విసిరిన పవన్ కళ్యాణ్ | లోకేష్ ని ఎన్నికల్లో ఓడిస్తా

Tuesday, 10 July 2018నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో పోటీచేసి గెలవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. లోకేష్ కు పోటీగా తాను ఒకరిని నిలబెడతానని, ఎవరు గెలుస్తారో చూద్దామని అన్నారు. దొడ్డి దారిన ఆయనను మంత్రిని చేశారని పవన్ విమర్శించారు. ఆదివారం విశాఖ ఐటీ హిల్స్ ప్రాంతంలోని కన్వెన్షన్ హాల్లో తన పార్టీలో పెద్దఎత్తున అభిమానులు చేరిన సందర్భంగా మాట్లాడిన ఆయన.. సినీ నటుడికి ఏం తెలుసునని చాలామంది విమర్శలు చేస్తున్నారని, అయితే ఏ పాలసీ మీద చర్చించడానికైనా తాను రెడీగా ఉన్నానని, చంద్రబాబు, లోకేష్ లేదా జగన్ ఎవరైనా తనతో చర్చించడానికి ముందుకు రావాలని ఛాలెంజ్ చేశారు.


ఉత్తరాంధ్ర నుంచి వలసలను టీడీపీ ప్రభుత్వం ఆపలేకపోయిందని, రాష్ట్ర హక్కుల సాధనలో 
సర్కార్ విఫలమైందని పవన్ దుయ్యబట్టారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు భూమి కేటాయింపును తప్పు పట్టారు. బాక్సైట్ గనుల తవ్వకాన్ని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు వ్యతిరేకించారు.. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న బాబు.. ఆ తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నారు అని ఆయన మండిపడ్డారు.