సాక్ష్యం మూవీ రివ్యూ **

Friday, 27 July 2018


విడుదల తేదీ : 27.07.2018
మ్యూజిక్  హర్షవర్ధన్ రామేశ్వర్  
నిర్మాత నామ అభిషేక్   
కథ & దర్శకత్వం : శ్రీనివాస్ 
సినిమాటోగ్రఫీవిల్సన్
నిర్మాణ సంస్థ: అభిషేక్ పిక్చర్స్ 
తారాగణం :  సాయి శ్రీనివాస్ బెల్లంకొండ , పూజ, మీనా, జగపతి బాబు,శరత్ కుమార్  తదితరులు. 

సాక్ష్యం మూవీ రివ్యూ 

జయ  జానకి  నాయక తర్వాత సాయి శ్రీనివాస్ బెల్లంకొండ చేస్తున్న చిత్రం సాక్ష్యం! జయ  జానకి  నాయక పర్వాలేదు వసూళ్ల పరంగా అనిపించినా ఆ క్రెడిట్ మొత్తం  బోయపాటి కొట్టేసాడు. శ్రీనివాస్ బెల్లంకొండ కి పేరు రాలేదు.ఈసారి ఫాంటసీ కథతో మన ముందుకు వస్తున్నాడు. డెక్టటెర్ తర్వాత శ్రీవాస్ చేస్తున్న చిత్రం కూడా ఇదే! 

బలాబలాలు 

బలం:
పూజ అందం
తారాగణం వారి నటన
నిర్మాణ విలువలు
పోరాట సన్నివేశాలు 

బలహీనత:
స్క్రీన్ ప్లే 
పాటలు వచ్చే సందర్భాలు 
లాజిక్ లేని సన్నివేశాలు 

విశ్లేషణ:  బెల్లంకొండ శ్రీనివాస్ నటనలో ఇంకా చాలా నేర్చుకోవాలి, నటనలో మెళుకువలు నేర్చుకోకుండ ఇలానే నటిస్తూ పొతే తన కెరీర్ కే ప్రమాదం! దర్శకుడు కథ బాగానే రాసుకున్నాడు కానీ కథనంలో లోపాలు కొట్టొచ్చినట్టు కనపడుతాయి. ఇదే తప్పు డెక్టటోర్ చిత్రంలో కూడా చేసాడు శ్రీవాస్.

పాటలు వినడానికి బాగానేఉన్నాయి మరియు చిత్రీకరణకూడా బాగుంది.కానీ ఎటొచ్చి ఆ పాటలు వచ్చే సందర్భం వాళ్ళ ప్రేక్షకులకు చికాకు తెప్పిస్తాయి.జగపతిబాబు కి మూస నాటక అనిపిస్తుంది.పోరాట సన్నివేశాలు బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. కెమెరా పనితనం కూడా బాగుంది.  ఫైటింగ్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు నచ్చుతుంది.

రేటింగ్:  2.5/ 5 

(బంధుమిత్రులకు షేర్ చేయండి)


గమనిక: ఈ రివ్యూ వ్యక్తిగతం గ భావించవలసిందిగా కోరుతున్నాం.