అదే జరిగితే కచ్చితంగా టీడీపీకి 20 ఎంపీలు 125 ఎంఎల్ఏ వస్తాయి?

Sunday, 8 July 2018ప్రధాని నరేంద్ర మోదీ మరో కీలక సంస్కరణ వైపు ముందడుగు వేయనున్నారు. దేశ గతిని పూర్తిగా మార్చే ఒక నిర్ణయానికి తెగించనున్నట్లు ఖచ్చితమైన సమాచారం లభిస్తోంది. ఆగస్టు 15న ప్రధాని నోటి నుంచి ఒక సంచలన ప్రకటన రావొచ్చని నేషనల్ మీడియా కోడై కూస్తోంది. ఢిల్లీ ఎర్రకోట వేదికగా జరిగే పంద్రాగస్టు ప్రసంగం ద్వారా.. ప్రధాని మోదీ ‘జమిలి ఎన్నికల’ నిర్ణయాన్ని వెల్లడిస్తారన్నదే సదరు బ్రేకింగ్ న్యూస్. ఇప్పటికే అనేక విడతలుగా కసరత్తు ముగిసిన ‘జమిలి’ ప్రక్రియకు పంద్రాగస్టు నాడే అంకురార్పణ చేయనున్నట్లు బీజేపీ అధిష్టానం ఫీలర్లిచ్చేసింది. ఆగస్ట్‌ 15 తరువాత దేశమంతా ‘ఎలక్షన్‌ మోడ్‌’లోకి వెళ్ళబోతోందని, పార్టీ శ్రేణులన్నీ సిద్ధంగా ఉండాలని అమిత్‌షా పార్టీ క్యాడర్‌కి డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో ఈ వార్తకు బలం చేకూరుతోంది.

పార్లమెంటుకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదన. ప్రభుత్వ యంత్రాంగాల్ని కూడా అప్రమత్తం చేసింది. ఇవ్వాళ రేపు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలతో లాకమిషన్ చర్చలు జరుపుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం సైతం సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చింది. కానీ.. అన్ని శాసనసభల పరిస్థితులూ జమిలికి అనుకూలించవు కనుక.. రెండు విడతలుగా ఎన్నికల నిర్వహణ జరిగేలా ‘రాష్ట్రాల విభజన’ కూడా జరిగిపోయిందన్నది మరో ఊసు. ఏదేమైనా.. మూడు కీలక రాష్ట్రాల అసెంబ్లీల గడువు ముగిసే డిసెంబర్ నాటికల్లా జమిలి నోటిఫికేషన్ వచ్చే అవకాశం వుంది. దీంతో పంద్రాగస్టు మీద దేశమంతా ఆసక్తి నెలకొంది.ఏపీ సీఎం చంద్రబాబు ఈ జమిలికి ససేమిరా అంటున్నాడు. రాష్ట్రప్రభుత్వం అనుమతి లేకుండా ఏ రాష్ట్రంలో   కూడా  అసెంబ్లీ ముందస్తు ఎన్నికలు జరపలేరు.ఎలాగైనా ఏపీలో కూడా ప్రభుత్వం ని రద్దు చేసి మళ్ళి ఎన్నికలు నిర్వహించాలి అని కేంద్రం పావులు కదుపుతోంది. ఒకవేళ అసెంబ్లీ , లోకసభ ఎన్నికలు వేరు వేరుగా జరిగితే మాత్రం టీడీపీ విజయం నల్లేరు మీద నడకే. మోడీ జిమిలి అని ఈ ఏడాదే ఎన్నికలకు పొతే ఏపీలో ఉన్న 25 లోకసభ స్థానాల్లో 20 కి పైగా గెలుస్తుంది, టీడీపీ రాష్ట్రంలో అధికారంలో ఉంది బాబు తన తెలివితేటలతో నంద్యాలలో గెలిచినట్టు టీడీపీ మంత్రులు , ఎమ్యెల్యే , ఏమ్మెల్సీ ఇలా అందరు కలిసి ప్రచారంలో పాల్గొంటారు.  వైసీపీ తట్టుకోవడం కష్టం, మోడీ ఎలాగో కేంద్రంలో సొంతంగా గెలవలేదు వైసీపీకి వచ్చిన 5 - 6 సీట్స్ బీజేపీకి సపోర్ట్ ఇవ్వక తప్పదు. ఆలా ఇస్తే ఏపీలో బీజేపీ మీద పీకలదాకా కోపం ఉంది ఆ దెబ్బ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలమీద పడుతుంది. అప్పుడు కూడా టీడీపీ 125 - 128 స్థానాలు అవలీలగా గెలుస్తుంది.

అందుకే టీడీపీ మళ్ళి విజయం మనదే అని ధీమాగా ఉంది. వైసీపీ పరిస్థితి మాత్రం ముందు నుయ్యి వెనక గొయ్యి.

Read also ఆందోళనలో వైసీపీ నేతలు * బీజేపీతో పొత్తు వద్దు ... కాంగ్రెస్ ముద్దు అంటున్న నాయకులు