కొడుకు గురించి తండ్రి ఎన్టీఆర్ జూ ట్వీట్

Saturday, 9 June 2018


నందమూరి వారి నాలుగో తరానికి తూరుపుముక్క లాంటోడు.. అభయ్ రామ్ నందమూరి. తారక్, లక్ష్మిప్రణతిల ముద్దుల కొడుకు అభయ్‌కి ఈ జులై 22 కల్లా నాలుగు పూర్తవుతాయి. పేరుకు నాలుగేళ్ల కుర్రాడే అయినా.. వయసుకు మించిన ‘అనుభవం’ కనిపిస్తోంది అభయ్ దగ్గర. వీలైనప్పుడల్లా సినిమా షూటింగులకు, ఫ్యామిలీ ఫంక్షన్లకు క్రమం తప్పకుండా తీసుకెళుతూ అతడికి ప్రపంచాన్ని చూపే ప్రయత్నం చేస్తున్నాడు తారక్. పైగా.. క్రమశిక్షణతో కూడిన పెంపకం ద్వారా అభయ్ బాగా రాటుదేలుతున్నాడంటూ నాన్న నుంచే సర్టిఫికెట్ దొరికేస్తోంది. డైట్ పంక్చువాలిటీ విషయంలో వాళ్ళమ్మ దగ్గర నుంచి అభయ్‌ని ఎవ్వరూ కాపాడలేరు అంటూ కామెంట్ చేస్తూ.. ఓ ముచ్చటైన ఫోటోని పోస్ట్ చేశాడు తారక్. ”వీడు అమ్మకు నిజంగానే భయపడుతున్నాడా.. లేక భయపడుతున్నట్లు నటిస్తున్నాడా..?.. ఎంతయినా నటచక్రవర్తుల వారసుడు కదా..” అంటూ కామెంట్లు, కాంప్లిమెంట్లు పడిపోతున్నాయి ఈ బుడ్డ నందమూరి మీద!