అలిగిన మంత్రి భూమా అఖిల ప్రియా?

Tuesday, 26 June 2018కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చేపట్టిన నిరాహార దీక్ష ఆరోరోజుకు చేరింది. ఆయన ఆరోగ్యం క్షీణించిందని, వెంటనే వైద్యం అందించాలని రిమ్స్ వైద్యులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఎంపీ రమేష్‌ని పరామర్శించి, దీక్షకు సంఘీభావం తెలపడానికి ఇరుగుపొరుగు జిల్లాల నుంచి తెలుగుదేశం నేతలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే దీక్షాస్థలికి చేరుకున్న మంత్రి అఖిలప్రియ.. చేతికి మైక్ అందుకున్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకొచ్చి ‘ఉక్కు’ దీక్షకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.

తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేందంటూ మిగతా పార్టీలను హెచ్చరించారు. ఇక్కడితో ఆపకుండా.. అవసరమైతే ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఢిల్లీకి సైకిల్ యాత్ర చేపడతామంటూ హింట్ ఇచ్చారు. అయితే.. ఢిల్లీకి సైకిల్ యాత్ర ఏమిటమ్మా.. అంటూ ప్రసంగం తర్వాత ఆమెను మిగతా నేతలు ఆరా తీసినట్లు తెలిసింది. సాధ్యాసాధ్యాలు చూసుకోకుండా ‘మాటలు’ జారవద్దని కొందరు పెద్దలు సూచించారని, అందుకు అఖిలప్రియ నొచ్చుకున్నారని కడప తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.