Hello రివ్యూ.....

Friday, 22 December 2017


తారాగణం:  అఖిల్,కళ్యాణి ,జగపతిబాబు,రమ్యకృష్ణ,అజయ్.
కథ  దర్శకత్వం: విక్రమ్ కుమార్
నిర్మాత : నాగార్జున
సంగీతం  :  అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రాఫర్  : వినోద్
కూర్పు : ప్రవీణ్  పూడి
నిర్మాణ సంస్థ:అన్నపూర్ణ స్టూడియోస్
విడుదల: 22 డిసెంబర్ 2017 




Hello రివ్యూ


అఖిల్ హీరోగా  మొదటి సినిమాతో ఇండస్ట్రీ డిజాస్టర్ ఇచ్చిన తర్వాత వస్తున్నా సినిమా హలో. ఈ సినిమాతో ఎలాగైనా సరే హిట్ కొట్టి చూపించాలి అఖిల్ తండ్రి నాగార్జున శపధం పూనాడు. ఈ సినిమా హిట్ ఐతే అఖిల్ కెరీర్ గాడిలో పడుతుంది లేదంటే అఖిల్ సినీ భవిష్యత్తు ప్రశార్థకమే! అందుకే అక్కినేని కుటుంబానికి మంచి హిట్ ఇచ్చిన విక్రమ్ ని దర్శకుడిని పెట్టి తీసిన చిత్రం హలో.


అలనాటి నటీమణి లిజి కూతురుని హీరోయిన్ గ ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతోంది. కల్యాణికి కూడా ఈ చిత్రం హిట్ ఐతే టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తాయి. కాబట్టి కళ్యాణి కూడా ఈ చిత్రం ముఖ్యమే. మనం తో ఒక్క సరిగా టాప్ దర్శకుల సరనస చేరిన విక్రమ్ తర్వాతి సినిమా 24 తో భారీ ప్లాప్ ఇచ్చాడు,కాబట్టి తనకి కూడా ఒక మంచి హిట్ అవసరం. ఏతావాతా ఏంటంటే ఈ సినిమా హిట్ అందరికి అవసరం.


కథ:శీను(అఖిల్‌) అనాథ. జున్ను (కల్యాణి) ఓ పెద్దింటి అమ్మాయి. చిన్నప్పుడే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. శీను సంగీతం అంటే జున్నుకి ఎంతో ఇష్టం. అనుకోకుండా జున్ను కుటుంబందిల్లీ వెళ్లిపోతుంది. ఒకరికొకరు సోల్‌మేట్‌గా భావించిన ఆ ఇద్దరూ ఒకరికోసం మరొకరు ఎదురుచూస్తుంటారు. పదిహేనేళ్ల తర్వాత జున్ను కుటుంబం అమెరికా వెళ్లిపోవాలనుకుంటుంది. జున్ను ఎలాగైనా శీనుని కలవాలని హైదరాబాద్‌ వస్తుంది. మరి వీరిద్దరూ ఎలా కలుసుకున్నారు. అవినాశ్‌, ప్రియలుగా ప‌రిచ‌య‌మైన‌ శీను, జున్నులు ఒక‌రినొక‌రు ఎలా గుర్తుపట్టారు అన్నదే కథ.


చిత్రం బలాబాలు ఒకసారి చూద్దాం!


బలం:


ఇంటర్వెల్ ముందు వచ్చే పోరాట సన్నివేశాలు.
ఏవేవో కళలు కన్నా... చిత్రీకరణ
పాటలు
అఖిల్ డాన్స్ మరియు ఫైట్స్
నిర్మాణ విలువలు
విజువల్స్ చాలా బాగున్నాయి
హీరో ,హీరోయిన్ జోడి బాగుంది  



బలహీనతలు :

అక్కడక్కడా లాజిక్ మిస్ అయినట్టు ఉంది.
అఖిల్ ప్రథమార్థంలో 30 నిమిషాలే
నెమ్మదించిన ద్వితీయార్థం
దర్శకత్వం 


చివరిమాట:  అఖిల్ మరో విఫల ప్రయత్నం...


రేటింగ్:  2.5 / 5

గమనిక: విశ్లేషణ వ్యక్తిగతంగా పరిగణించండి.