తోక ముడిచిన ఐలయ్య

Thursday, 2 November 2017


హైదరాబాద్/అమరావతి: గత రెండు నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న పేరు ఐలయ్య. తను హిందువులమీద చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో చెప్పనక్కరలేదు, సాక్షాత్తు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులే ఐలయ్యకు హెచ్చరిక  జారీ చేయవల్సివచ్చింది. ఐలయ్య వైస్యుల మీద రాసిన పుస్తకం పెద్ద సంచలనం అయ్యింది. ఐలయ్య ఏదోఒకటి చేసి పాపులర్ అవ్వాలని కళలుకన్నాడు, అనుకున్న దానిలో సగం సాధించాడని చెప్పవచు. రెండు నెలలముందు తెలుగు రాష్ట్రాల్లో ఐలయ్య పేరు చాలా మందికి తెలియదు, ఇప్పుడు ఐలయ్య ఒక సెలబ్రిటీ అయ్యిపోయాడు.


ఐలయ్య కులాల మధ్య చిచ్చు పెట్టి తను కింగ్ మేకర్ అవ్వాలని కలలు కన్నాడు. కానీ అయ్యింది ఒకటి అనుకున్నది ఇంకొకటి.సాధారణంగా రాష్ట్రంలో సమస్య వచ్చినపుడు ప్రతిపక్షం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుంది అది సహజం, ఇక్కడ ఐలయ్య కూడా అదే అనుకున్నాడు. తెలంగాణాలో కాంగ్రెస్ వారు మద్దతిస్తారు అనుకున్నాడు అటు ఆంధ్రప్రదేశ్ లో వైస్సార్సీపీ దన్నుగా నిలుస్తుంది అని భావించాడు ఐలయ్య. కానీ ఆలా జరగలేదు. అటు కాంగ్రెస్ ఇటు  వైస్సార్సీపీ ఇరు పార్టీలు మిన్నుకుండిపోయాయి.


మొదట తెలంగాణాలో చిచ్చుకి తెరలేపాడు అక్కడ తన పాచికలు పారకపోవడంతో ఆంధ్రప్రదేశ్ మీద కన్నేశాడు. అందులో భాగంగానే విజయవాడలో భారీ బహిరంగ సభకి పెట్టాలినుకున్నాడు. పాపం ఐలయ్యకు తెలంగాణాలో కనీసం పాపులారిటీ అన్న దక్కింది, ఆంధ్రప్రదేశ్ లో అసలు తన ఉనికిని కూడా నిలబెట్టుకోలేకపోయాడు.
ఈవిషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మెచ్చుకోవలసిందే. ఒకవేళ ఐలయ్య కు ప్రతిపక్షాల మద్దతు దక్కింటే ఈపాటికి రెండు రాష్ట్రాలు రావణకాష్టంలా  మండుతూవుండేది. ఒక్క కమ్యూనిస్ట్ పార్టీలే  (సిపిఐ, సిపిఎం) ఐలయ్యకి కొద్దో గొప్పో మద్దతు పలికాయి కానీ ఐలయ్య కళలు కల్లలుగానే మిగిలిపోయాయి.


మొత్తానికి తెలుగు రాష్ట్రంలోని అన్ని పార్టీలని  ఏకతాటి మీద నిలబడేట్టు చేసిన ఘనుడు ఐలయ్య!