ఆదిత్య 999 సినిమాలో విలన్ పాత్రలో రాజశేఖర్ !

Saturday, 28 October 2017


ఆదిత్య 369 కి సీక్వాల్ గ సినిమా రాబోతుందని గత రెండు సంవత్సరాలుగా వింటున్నాం. ఎట్టకేలకు ఆ చిత్రం మీద  దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు స్పందించారు. కథ రెడీ అయిందని బాలయ్య బాబు కూడా  కథ విన్నారని తాను కూడా చేద్దాం అన్నారని చెప్పారు. కథ సిద్ధం అయ్యింది ఇప్పుడు పక్కా స్క్రీన్ ప్లే కోసం మా టీం పనిచేస్తోందని చెప్పారు. ఈ సినిమా లో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ కూడా ఒక మంచి పాత్ర వేస్తున్నాడు అని చెప్పారు.


ఇంకో విశేషం ఏంటి అంటే హీరో రాజశేఖర్ ఈ చిత్రంలో విలన్ గ చేయబోతున్నాడు అని ఇండస్ట్రీలోని మాట. లెజెండ్ సినిమాతో హీరో జగపతిబాబుని విలన్ పాత్రలో వేసి ఆ సినిమా హిట్లో పాలుపంచుకున్నారు. లెజెండ్ కి ముందు తెలుగు ప్రజలు జగపతిబాబు పని ఐపోయింది అని అనుకున్నారు కానీ ఇప్పుడు జగపతిబాబు దాదాపు తండ్రిపాత్రలు మరియు కింన్నింగ్ విలన్ పాత్రలన్నీ తనకేవస్తున్నాయి. రాజశేఖర్ పరిస్థితి కూడా దాదాపు లెజెండ్ కి ముందు జగపతిబాబులాగా ఉంది. అందుకే రాజశేఖర్ కూడా విలన్ పాత్రలకి రెడీ అయ్యాడు, సింగీతం అడిగిన వెంటనే సరే అన్నాడని ఇండస్ట్రీలో టాక్! మ్యూజిక్ ఇళయరాజా ఉండొచ్చు అని అంటున్నారు.