సినిమాలు తీయడం ఆపేసిన సురేష్ ప్రొడక్షన్స్???

Thursday, 5 October 2017


ఒకప్పుడు తెలుగు సినిమాని శాసించిన సంస్థ సురేష్ ప్రొడెక్షన్, అలాంటి సంస్థ ఇప్పుడు కష్టాల్లో ఉందని, నిర్మాణ బాధ్యతలనుండి సురేష్ బాబు తప్పుకున్నాడని నేను రాజు నేనే మంత్రి సురేష్ ప్రొడక్షన్స్ చివరి సినిమా అని గుసగుసలు వినిపిస్తున్నాయి.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు వినిపిస్తున్నకొత్త మాట సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నుండి ఇంక సినిమాలు రావు.

సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబుకి కాలం కలసిరావడం లేదు, తండ్రి మూవీ మొగల్ రామా నాయుడు చనిపోవడం, తీసిన సినిమాల నుండి లాభాలు రాకపోడం, పంపిణీదారుడిగా కూడా పెట్టుబడి ఎక్కువ రాబడి తక్కువుగా ఉండడం ఇలా అన్ని విధాలుగా సురేష్ బాబు కి కలసిరావడం లేదు. మొదటినుండి సురేష్ బాబు ఎక్కువుగా పంపిణీదారుడిగా బాగా పేరు సంపాదించారు కానీ నిర్మాతగా ఆశించినంతగా పేరు రాలేదు. తండ్రి రామునాయుడు నిర్మాతగా ఉంటె సురేష్ సినిమాని కోస్త , ఆంధ్రలో సినిమాలను విడుదల చేసి లాభాలు ఆర్జించేవాళ్ళు.

ఇప్పుడు వున్నా ట్రెండ్ సురేష్ బాబు కి వొంటబట్టడంలేదు,ఇప్పుడు అన్ని మూడువారాల సినిమాలు. సినిమా హిట్ ఐతే 3 వారాలు లేదంటే 3 రోజులు. దేనితో చిన్న సినిమాలు చేయాలంటే భయపడుతున్నారు నిర్మాతలు. సురేష్ బాబు కూడా కొన్ని సినిమాలు చేసాడు కానీ లాభాలు రాకపోగా పెట్టిన  పెట్టుబడి రాలేదు. దేనితో సురేష్ బాబు బాగా డీలా పడ్డాడు, తమ్ముడు వెంకటేష్ తో సినిమా చేద్దాం అనుకున్న ధైర్యం సరిపోవడం లేదు. కొడుకుతో సినిమా చేసి ఇంక ఆపేద్దాం అనుకొనే నేనే రాజు నేనే మంత్రి సినిమా చేసారు అని తెలుగు సినీ పరిశ్రమలో వినపడుతున్న మాట.

ఇప్పటికే సురేష్ బాబు కుటుంబ సభ్యులు హైదరాబాద్ వదిలి తమ సొంత వూరు కారంచేడుకి వెళ్లిపోయారని  సురేష్ బాబు కూడా ఇంకో రెండు మూడు నెలలో స్టూడియో బాధ్యతలు నమ్మినవాళ్ళకి అప్పజెప్పి కారంచేడుకీ పోతాడు అని అనుకుంటున్నారు.కొడుకు రాణా కూడా హైదరాబాద్ లో కన్నా ఎక్కువుగా చెన్నై లేదా ముంబైలోనే కలం గడుపుతాడు.రాణా రామానాయుడు స్టూడియో బాధ్యతలు చూసుకోవడం నాకు చేతకాదు అని ఖరాకండిగా సురేష్ బాబుకి చెప్పాడు అని అనుకుంటున్నారు. కొందరేమో కొత్త రాష్ట్రంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నాడని అక్కడ సురేష్ సినీ స్టూడియో నిర్మించాలని ఆలోచనతోనే ఆంధ్ర ప్రదేశ్ కి వెళ్లాడని వినిపిస్తోన్న ఇంకో మాట.

ఏదిఏమైనా సురేష్ ప్రొడక్షన్స్ నుండి సినిమాలు రావు అంటే మాత్రం సినీ ప్రేమికులకు మింగుడు పడని విషయమే.