లేడీ టెక్కీ దుర్మరణం!

Monday, 30 October 2017

బెంగుళూరు: నగరంలోని హోరమవు అగరలో నివసిస్తున్న 28 ఏళ్ళ సంగీత అనే మహిళా టెక్కీ ప్రమాదపు సాత్తు మృతి చెందింది. గత శుక్రవారం సాయంత్రం ఏడు గంటల ప్రాతంలో తాను నివసిస్తున్న అపార్ట్మెంట్ టెర్రేస్ ఎక్కి  అటు ఎటు తిరుగుతూ  తన తల్లితండ్రులతో చేరవాణిలో (ఫోన్) మాట్లాడుతోంది. ఆమె దురదుష్టమో ఏమో అప్పుడే కరెంటు పోయింది, తను కరెంటు పోయినట్టుకూడా గ్రహించలేదు. తను ఆ చీకట్లోనే తిరుగుతూ ఉండగా కాలు జారీ ఐదు అంతస్తుల్ల భవనం నుండి పడిపోయింది.


క్రింద తన ఫ్లాట్ లో భర్త  ఎనిమిదింటి దాకా చూసి ఇంకా రాలేదేమని టెర్రేస్ మీదకి వచ్చి చూస్తే ఎవరూలేరు. సంగీత ఫోన్ కి కాల్ చేస్తే రింగ్ కావడం లేదు. కంగారు పడ్డ భర్త సంగీతకి తెలిసిన ఫ్లాట్స్ ఇళ్లకు వెళ్లి అడిగాడు. సంగీత తల్లితండ్రులకి , తెలిసిన వాళ్లందరికీ కాల్ చేసాడు లాభంలేదు అనుకోని చుట్టుపక్క వెతకడం ప్రారంభించాడు. సుమారు పదిగంటల ప్రాంతంలో సంగీత శవాన్ని గమనించారు. అపార్ట్మెంట్ వెనకప్రాంతంలో సంగీత పార్థివ దేహం దొరకడంతో పోలీసువాళ్ళు వచ్చి కేసు నమోదు చేసారు.


పోలిసుల ప్రాథమిక విచారణ ప్రకారం సంగతది ప్రమాదపు సాత్తూ మరణించింది అని చెప్పారు. సంగీత పార్థివ దేహానికి పంచనామా పూర్తీ చేసి, సంగీత భర్తకి పార్థివ దేహం అప్పగించారు. శనివారం సంగీతకు అంత్యక్రియలు పూర్తిచేశారు. సంగీత బెంగళూరులోని మల్టీ నేషనల్ కంపెనీలో సాఫ్ట్ వారే ఉద్యోగిగా గత నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తోంది. గత ఏడాదే సంగీతకి వివాహం అయ్యింది.